చక్రవర్తుల రాజగోపాలాచారి స్వాతంత్ర్య పోరాటములో పాల్గొన్న దేశభక్తుడు. ఆయన స్థాపించిన "స్వతంత్ర్య పార్టీ" ఆనాటి రోజులలో పేరెన్నిక గన్నది. గొప్ప రచయిత కూడా.
రాజాజీ రాసిన తమిళ పాట
" kurai onrum ellai maraimoorthi kanna" ను 1966 లో U.N. లో M.S. సుబ్బులక్ష్మి గానం చేసారు.
*********************************************************************
ఆమె, భర్త T. సదాశివమ్ లు తమ ఇంటికి భోజనమునకు రమ్మని, రాజాజీని ఆయన అనుచరులనూ ఆహ్వానించారు. విందులో అరిసెలు, బొబ్బట్లు వంటి రుచికరమైన పిండి వంటలను కూడా వడ్డించారు. బెల్లంతో తయరు చేసిన భక్ష్యాలను అందరూ తిని, ప్రశంసించారు. రాజాజీ "విందు సంపూర్ణంగా రుచికరముగా ఉందమ్మా! "అని మెచ్చుకుంటూ కృతజ్ఞతలను తెలిపారు.
ఆనక, కొంచెం తాళి ఇలా అడిగారు " సదాశివం గారూ! వంటింట్లో బెల్లానికి చీమలు ఏమైనా పట్టాయా?" ఆ ప్రశ్న దంపతులను తికమక పెట్టినది. అప్పుడు వంటింట్లోకి వెళ్ళి, పరిశీలించారు ; నిజంగానే చీమలు పుట్టలు పుట్టలుగా బెల్లానికి పట్టి ఉన్నాయి.
రాజాజీ నిశిత పరిశీలనా శక్తికి అక్కడ ఉన్నవారు అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
"కల్తీ లేని తీపి వస్తువులకు చీమలు పడతాయని గుర్తించారు; అన్యాపదేశంగా వారు ఇచ్చిన విందును రాజాజీ మెచ్చుకున్నారని" సుబ్బులక్ష్మి దంపతులు, సంతోషం పొందారు.
*********************************************************************