|
|
|
వేరుశనగపప్పు పొడి
అందరికి నమస్కారం. నాపేరు స్వాతి. మాది హైదరాబాదు. నాకు వంటచేయడం చాలా ఇష్టం.నేను చేస్తున్న, సేకరిస్తున్న వంటకాలను మీకు పరిచయం చేయడానికి ఇప్పుడుఇలా! ముందుగా ఈరొజు వేరుశనగపప్పుతో పొడి తయారి నేర్చుకుందాం.
కావలసిన వస్తువులు: వేరుశనగపప్పు 200గ్రాములు(ఇంట్లో మనుషులను బట్టి కావలసినంత తీసుకొండి) ఎండుకొబ్బరి తురుము1కప్పు కారం-1చెంచా ఉప్పు-సరిపడినంత వెల్లుల్లిపాయలు-3 జీలకర్ర-2చెంచాలు కరివేపాకు-4 రెబ్బలు వేరుశనగపప్ఫు ఖాళీ బాండిలో వేపి(నూనే లేకుండా) మెత్తగా పొడి చేసుకోవాలి. జీర, వెల్లుల్లి, కరివేపాకు,(వేయించి)మెత్తగా నూరి ఈ పొడులలో కలిపి ఎండుకొబ్బరి తురుము వేయించి నూరి ఈ పొడులలో కలిపితే రుచి బాగుంటుంది. లేదా అన్ని కలిపి మిక్సి చేసుకోవచ్చు. ధన్యవాదములు., స్వాతి http://oosulu.blogspot.com
|
| | |
|
|