Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Recipes

జింజర్ షర్బత్

By Kamala M, Mar 22 2009 12:39PM


కావలసినవి:

అల్లం - 300గ్రా.

నిమ్మకాయలు - 10

పంచదార - 500గ్రా.

ఉప్పు - 1 స్పూను

చేసే విధానం:

అల్లంను శుభ్రంగా కడిగి, తుడిచి కాస్త నీళ్ళు చల్లుతూ తొక్కాలి. ఇలా రెండుసార్లు నీళ్ళు చల్లుతూ తొక్కి సుమారు ఒక అరకప్పు రసం దాకా పిండుకోవాలి. రసంలో తొక్క లేకుండా చూసుకోవాలి.

నిమ్మరసం తీసి పలుచని బట్టలో వడకట్టి ఉప్పు కలపండి. ఒక పాత్రలో పంచదార మరియు అల్లపురసం కలిపి సన్నని సెగమీద లేతపాకం వచ్చేదాక ఉంచి దించి ఆరిన తరువాత నిమ్మరసం కలపండి. బాగా ఆరిన తరువాత సీసాల్లో నింపుకోవాలి. అంతే, జింజర్ షర్బత్ రెడీ!
Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb