|
|
|
ఇంట్లోనే పెయిన్ బామ్ తయారీ
"నోపిన్"అని పాత రోజులలో ఒక మందు ప్రాచుర్యములో ఉండేది. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడది గుర్తుకు వచ్చింది."No pain" నుండి "Nopin" అనే మాటను క్రియేట్ చేసి, ఆ లేపనమునకు పేరు పెట్టారని అర్ధమైనది. ఏ భాషలో నైతేనేమి, అర్ధవంతమైన పేరును ఆ కంపెనీ వాళ్ళు ఎన్నుకున్నందుకు "శభాష్!" అనిపించింది.
మీకు తెలుసా? మనం ఇంట్లోనే పెయిన్ బామ్ తయారు చేసుకోవచ్చునని!
పెయిన్ బామ్ తయారు చేయుట
కర్పూరము - 200గ్రాములు పుదీనా పువ్వు - 10గ్రాములు వీజలైన్ - 100గ్రాములు
చేసే పద్ధతి
100గ్రాముల వ్యాజిలైనును వేడి చేయాలి. ఒక పింగాణీ పాత్రను తీసుకోవాలి. దానిలో 200 గ్రాముల కర్పూరాన్ని, 10 గ్రాముల పుదీనా పువ్వును బాగా కలిపి ఉంచాలి. వేడి చేసిన వేజిలైనులో పై చెప్పిన కర్పూర మిశ్రమాన్ని కలిపి, ముద్దగా చేయాలి.
తల నొప్పి వచ్చినపుడు, కొంచెము రాసుకుని, మర్దన చేసుకొన్నచో గుణము కనిపిస్తుంది.
గమనిక:-
ఇంటిలో తయారు చేసుకునే వస్తువు కాబట్టి ఇలాంటి వాటిని మొదట కొంచెముగా వాడి పరీక్షించుకోవడము మంచి పద్ధతి. ఎందుకంటే, మనము మార్కెట్టు నుండి కొని తెచ్చే వస్తువుల నాణ్యతను తయారు చేసేటప్పుడు మనము ఆ సామగ్రిని కలిపే నిష్పత్తి, ఇతర అంశాలు కూడా పరిగణనలోనికి వస్తాయి.
|
| | |
|
|