|
|
|
యాపిల్ జెల్లీ
కావలసినవి:
యాపిల్ రసం - అర లీటరు
చక్కెర - అర కేజీ
మీకు నచ్చిన కలర్ మరియు ఎసెన్స్
సిట్రిక్ యాసిడ్ - కొద్దిగా
చేయు విధానం:
* యాపిల్ ముక్కలు కోసి గింజలు తీసేసుకోవాలి.
* పాత్రలో ముక్కల్ని వేసుకొని, అవి పూర్తిగా మునిగేటట్లు నీళ్ళు వేయాలి.
* 15ని. సన్నటి సెగ మీద ఉడకనివ్వాలి.
* రసం వేరు పడేటప్పుడు సిట్రిక్ యాసిడ్ కలపాలి.
* రసం వేరుపడిన తర్వాత దించి ఈ మిశ్రమాన్ని ఒక పల్చని గుడ్డలో పోసి వడకట్టుకోవాలి.
* వడకట్టుకొన్న రసాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని చక్కెర చేర్చి పాకం పట్టాలి.
* బాగా ముదురు పాకం వచ్చాక, చల్లారనిచ్చి ఎసెన్స్ కలపాలి.
అంతే, యాపిల్ జెల్లీ తయార్ !
చక్కగా శుభ్రపరచుకొన్న సీసాలోనే జెల్లీని నింపుకోవాలి.
|
| | |
|
|