Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Recipes

కాటుక చేసే విధానం

By kadambari piduri, May 10 2009 9:23AM

కావలసిన వస్తువులు

పత్తి వత్తి(పురి పెట్టకుండా) వట్టి దూదిని లావుగా అరచేతిలో పరచుకునాలి, దీనిలో కరక్కాయ పొడిని చల్లి,ముడిచి అరచేతుల్తో మళ్ళీ నలుస్తూ ఉండ వత్తిలా లావుగా తయారించాలి
కరక్కాయ పొడి(పైన చెప్పినదే!)
ముద్ద కర్పూరము (లేదా/మంచి గంధమును,చెక్కను సాన రాయి మీద అరగ దీస్తూ,తయారించుకోవాలి.)
వెడల్పుఇత్తడి పళ్ళెము
వంటాముదము
ప్రమిదలు
ఆవు నెయ్యి/లేక - వెన్న
ధారాళంగా నీళ్ళూ(భాగ్య నగరము మున్నగు చోట్ల నివసించే వారికి ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది కదా!)

1)ముద్ద కర్పూరముతో కాటుక తయారీని ముందుగా తెలుసు కుందాము.
ముందస్తుగా వత్తిని మంచి ఆముదములో కాస్సేపు నాన బెట్టి ఉంచుకోవాలి.
2)ఒక గుంట గరిటను కాస్త వాల్చినట్లుగా,ప్రమిదకు బాగా దగ్గరగా బోర్లించి పట్టుకోవాలి.
3)కర్పూరమును వెలిగించాలి.
5)అప్పుడు గుంట గరిటలోనికి "కప్పురపు మసి"ఏర్పడుతుంది.
6)ఆ మసిని రాగి పళ్ళెము ను(ఐతే శ్రేస్ఠము:కానిచో ఇత్తడి/కంచు పళ్ళెములపనుబోర్లించి పెట్టి,నూరాలి.
7)్ ఆవు నేతితో గానీ,వెన్నతో కానీ ,ఆముదమును (బొట్లు బొట్లుగా )వేసి,నూరుతూండాలి.
8)నూ రి,ముద్దగా ఏర్పడేటప్పుడు,ధారగా నీళ్ళు పోస్తూండాలి.ఇలాగ బిందెడు నీళ్ళు పోయాలి.
9)రెడీ ఐన 'కాటుక'ను,రాగి భరిణలలోనికి తీసి జాగ్రత్త చేసు కోవాలి.
4)బోర్లించి ఉన్న ప్రమిదలో పత్తి వత్తిని వెలిగించాలి.

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb