|
|
|
రాయలు-కుహూ యోగం
"బీచుపల్లి"కి ఆ పేరు రావడానికి ఒక హేతువు ఉన్నది."ఆంధ్ర భోజుడు" ఐన శ్రీ కృష్ణ దేవ రాయలకు జ్యోతిష్యులు చెప్పారు "ప్రభూ!మీకు మూడు సంవత్సరమ్ములు 'కుహూయోగము ఉన్నది." అందుచేత రాయలవారు 1521నుండి1524 వఱకు"మదనపల్లె"ను" శ్రీ కృష్ణముద్ర" తో పరిపాలించారు. అయితే, ఆ ప్రాంతము "వ్యాస రాయలు"కు ఇచ్చినట్టి దాన భజ్యోభవిష్యత్తు గురించి "శ్రీ కృష్ణ ముద్ర"తో పాలించిన విజయనగర సామ్రాజ్య తేజో విరాజి,తిరిగి వ్యాసరాయలుకు ఇచ్చివేసారు. పాప పరిహారార్ధమై 378 దేవతా విగ్రహాలను ప్రతిష్ఠ చేసారు. వ్యాసరాయలు అక్కడ హనుమంతుని కోవెలను నిర్మించాడు. ఇక్కడ రెండు వైపుల శ్రీ ఆంజనేయస్వామికి శంఖ, చక్రములు ఉన్నాయి. "హనుమంతుల వారిని దర్శించుకోవడనికి వచ్చేమొట్ట మొదటి వ్యక్తియే పూజారిగా ఉండాలని"వాక్కు పలికాడు."బీసన్న"అనే బోయ పిల్ల వాడు ప్రప్రధమంగా స్వామి వద్దకు వచ్చి, సాష్టాంగ నమస్కారము చేసాడు. ఆనాటినుండీ,"బీచు పల్లి"గా పేరొందిన హనుమత్ క్షేత్రానికి, వ్యాసరాయలు అభీష్టము ప్రకారము,నెలకొల్పబడిన ఆ సంప్రదాయము నేటికినీ అవిచ్చన్నముగా పాటించబడుచున్నది. |
| | |
|
|