Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Telusaa!

న్యూయార్కులో సంస్కృతం

By kadambari piduri, Sep 7 2009 5:56AM
"Clay Sanskrit Library " నిర్మాత ఒక ఆంగ్లేయుడు. జాన్ క్లే , తన భార్య జెన్నిఫర్ తో కలిసి చేసిన అవిరళకృషికి ప్రతిబింబము. 1934 లో న్యూజెర్సీ వద్ద ఉన్న పీటర్ సన్ లో క్లే జన్మించాడు.
1950 లో ఆక్స్ ఫర్డు యూనివర్సిటీలో "సంస్కృత ప్రాచీన సాహిత్యము"ను అధ్యయనం చేసాడు.
కొన్నాళ్ళు "గ్లోబల్ ఇన్విస్టుమెంట్సు బ్యాంకింగు"లో మెలగాడు. కానీ, తన అంతరాళాలలోని సంస్కృత భాషా మమకారము అతనిని మళ్ళీ జీవితాశయ మార్గమునకే నడిపించింది.
దేవ భాషా మహోద్గ్రంధాలను 1965 నుండీ 2004 వఱకు నిరంతర దీక్షా దక్షతతో, ఇంగ్లీషు లోనికి అనువదించాడు. Loeb Classical Library నెలకొల్పిన John Clay మహాశయుడు New York University press ద్వారా 46 వాల్యూములను వెలువరించాడు .స్వదేశీయులే శీత కన్ను వేస్తూన్న "సంస్కృత సాహిత్య విలువలను " గుర్తించిన పాశ్చాత్య మేధావులు గుర్తించి గౌరవిస్తూన్నారు కదా! మన అపార ప్రాచీన సాహితీ నిధుల విలువలను ,అగణిత కావ్యముల ప్రామాణికతల ఘన కీర్తిని గుర్తించ దలుచుకోని నేటి తరం వారి గురించి ఏమని చెప్ప గలము !?!
Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb