Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Tit Bits

సంగీత సామ్రాజ్ఞి సుబ్బులక్ష్మి

By kadambari piduri, Sep 15 2009 9:45AM

గాన కోకిల M.S. సుబ్బు లక్ష్మి గాత్రము ఎల్లరికీ సుపరిచితమే !

"నా భర్త సదాశివం ప్రోత్సాహము వలన నేను ఇంత కీర్తి శిఖరాలను అధిరోహించగలిగాను." అని ఆమె కృతజ్ఞతతో చెప్పేది.

"తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాను. అప్పుడు మా అమ్మ నన్ను పిలిచింది.పాట పాడమనిఅన్నది. ఒక పాట పాడాను. అప్పుడు చప్పట్లు మారుమ్రోగాయి. ఐతే, నాకు అవేవీ బోధపరచుకొనని వయసు. పాట పాడటము అయిపోగానే మళ్ళీ స్కూలు పిల్లలతో మట్టిలో ఆడుకుంటూ కూర్చున్నాను." అని బాల్య స్మృతులను మననం చేసుకున్నది, ఆ నైటింగేల్ ఆఫ్ కర్ణాటక సంగీతం ".

* ఆమె సమకాలీనురాలైన, భారత కోకిల బిరుదాంకితురాలైన సరోజినీ నాయుడు ఉవాచ "From today, I surrender to Subbulakshmi, the enchanting singer with an enchanting voice, my tittle The Nightingale of India".

* మహాత్మా గాంధీజీ ఆమె సంగీత మాధుర్యాన్ని ఇలా ప్రశంసించారు "I would rather hear the words of the bhajan spoken by Subbulakshmi than sung by any one else.".

జాతి పితకు ఇష్టమైన "వైష్ణవ జనతో తేన కహి ..." , మీరా భజనలు ఆమె గళములో ప్రాణం పోసుకుని, ప్రజా బాహుళ్యములో ప్రాచుర్యాన్ని పొందాయి.

* జవహర్ లాల్ నెహ్రూ ఇలా పలికారు "Who am I before this melody Queen? A mere Prime Minister. And what right have I, or any one else, to speak when she is there to sing."

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb