Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Telusaa!

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ - తత్వశాస్త్రము

By kadambari piduri, Sep 25 2009 8:34AM
ఇండియాకు రెండవ రాష్ట్రపతి, సర్వేపల్లి రాధాకృష్ణన్( 5 September 1888 – 17 April 1975), తత్వ శాస్రమును మాస్టర్స్ డిగ్రీలో ఎంచుకోవడము యాదృచ్ఛికంగా జరిగింది. వెల్లూరులోని Voorhee’s Collegలో "గ్రాడ్యుయేషన్ లో చేరాడు.అదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన రాధాకృష్ణన్ కు ఆతని కజిన్ తన బుక్సును ఇచ్చాడు. అంత వరకూ నిర్ణయమేదీ లేని రాధాకృష్ణన్ ఆ పుస్తకములను చదివాడు. దానితో "భారతీయ తత్వ శాస్త్రము, తీరు తెన్నులు " ను అవగాహన చేసుకోవాలనే ఆసక్తి పెరిగింది. తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో ( 1906 ) M.A. లో చేరాడు.అక్కడి ప్రొఫెసర్ A.G. Hoggs కు తన పరిశోధనాంశము" The Ethics of the Vedanta "ను సమర్పించాడు.
డాక్టర్ హోగ్ కు తన రచన నచ్చదేమో?"నని భయపడ్డాడు. కానీ చిత్రంగా అందుకు భిన్నంగా "మిష్టర్ రాధాకృష్ణన్! మీ రీసెర్చ్ ఎక్స్ లెంటుగా ఉంది.:" అని అభినందించాడు.ఆ థీసిస్ పబ్లిష్ అయ్యే నాటికి సర్వేపల్లి రాధాకృష్ణన్
వయసు 20 ఏళ్ళు. తూర్పు పశ్చిమ దేశాల తాత్విక చింతనలకు నడిమి వంతెన"గా కొనియాడ బడ్డాడు.
" President of India 1962 - 1967 స్టాంపును ఆయన బొమ్మను ముద్రించిన 15 పైసల స్టాంపును - Indian government విడుదల చేసింది.
Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb