Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Aavakaaya Special

సాగరవీణ

By kadambari piduri, Oct 1 2009 9:10AM
నూర్ జహ్రా ( Noor Zehra ) "సాగర వీణా" వాదనలో నిపుణురాలు. సంగీతాభిరుచి కల ఆమె అనుకోని విధంగా సాగర వీణను మీటడం నేర్చుకున్నది. ఆమె తండ్రి రియజ్ (Mohammed Riaz) సంగీత వాయిద్యముల రిపేర్లు, తయారు చేసే వృత్తిని ఉపాధిగా గైకొన్నాడు.

Noor Zehra playing Sagara Veena

సాధారణ వీణ ఆకారంలో పెద్దది. అందువలన కచ్చేరీలు ఇచ్చుటకై వీణను తీసుకు వెళ్ళడము క్లిష్ట సమస్యగా మారుతుంది. ఈ సమస్యా పరిష్కారానికై సంగీతజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేస్తూ తేలికైన కొత్త రకము వీణలను తయారు చేస్తూ వచ్చారు.

రియాజ్ వీణా రాగములను అభిమానిస్తాడు.అందుచేత, నిరంతరమూ, ఏదైనా కొత్త గా వైవిధ్యమైన వీణను నిర్మించాలని ఆలోచిస్తూ ఉండేవాడు. 1970 సంవత్సరము నాటికి అతని శ్రమ ఫలించింది. విచిత్ర వీణ, మోహన వీణల రీతిలో సాగరవీణను సృజించాడు. దీనిని నానాటికి మరింతగా మెరుగు పరిచాడు. వైణికులు సాగర వీణను ఆసక్తితో కొనే వారు.

అదృష్ట వశాత్తూ అతని కుమార్తె జెహ్రా సాగర వీణపై సంగీతమును నేర్చుకోడానికి ఆసక్తి చూపించింది. లాహోరు, పాకిస్థాన్,ఇతర దేశాలలో ఆమె సాగర వీణా కచేరీలు చేస్తూన్నది.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb