Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Telusaa!

తిరుప్పుల్లాని - దర్భశయనము

By kadambari piduri, Oct 6 2009 4:42AM


తమిళనాడులోని 'తిరుప్పుల్లాని" పాండ్య నాడుగా ప్రసిద్ధి కెక్కినది. ఇది రామనాథ పురము దగ్గర ఉన్నది. ఇచ్చట కోవెల ప్రసిద్ధి ఐన పుణ్య క్షేత్రములో మూలవరులు కళ్యాణ జగన్నాధన్ (Kadaladaitta Perumaal)మరియు అమ్మవారు పద్మాసన అయినట్టి కళ్యాణ వల్లి.

ప్రాచీన తమిళ సంగం ఆధారముగా (Akanaanooru) ఈ దివ్య క్షేత్రము విశిష్టంగా ఉగ్గడించ బడినది. తిరు మంగై ఆళ్వార్ పాశురము ద్వారా అనేక విశేషములు బోధపడుతున్నాయి. దివ్య దేశములలో ఒకటైన ఈ తిరుప్పుల్లాని దర్భశయనముగా పేరు కాంచినది. ఇక్కడ హేమ తీర్థము, దగ్గరలో దేవీ పట్టణము వద్ద దశరధ నందనుడు పూజించిన "నవ పాషాణములు", పాంబన్ బ్రిడ్జి, palk strait, rochy wave, తలై మన్నార్ ప్రయాణీకులను ఆకర్షించే అంశాలలోనివి. ఈ అత్యంత ముఖ్యమైన విశేషముల వలన తిరుప్పుల్లాణి సదా మాననీయమైనది.

శ్రీరాముల వారు శ్రీలంకకు వారధిని కట్టుటకై ఉద్దేశ్యించి, ఆరంభించిన ప్రదేశము ఇది. అశ్వత్థ తరువు క్రింద తపస్సు చేయుచున్న"పుల్ల మహర్షి" ఆశీర్వాదములను పొంది, సీతాపతి సేతు నిర్మాణమును మొదలిడెను. అందుచే ఈ చోటు "పుల్లారణ్యము"అని వాసి కెక్కినది. విభీషణుడు ఇక్కడికి వచ్చి అభయమును పొందుటచేత విభీషణ శరణాగతి జన గాథ అయినది.

యుద్ధములో గెలిచి, సీతాదేవితో వచ్చిన పట్టాభిరాముడు వెలసిన ప్రాంతము ఇది. ధనుష్కోడి( = ధనుష్కోటి) ,తలైమన్నార్, రామసేతు ఇత్యాది స్థలములను వీక్షించి భక్తులు ధన్యులౌతునారు.

48 కిలో మీటర్ల రైల్వే బ్రిడ్జి, వంతెనలతో ప్రయాణ సదుపాయాలు ఉన్నవి. రామసేతువు దక్షిణ ప్రాంతాన్ని సునామీ నుండి కాపాడిన కోట వలె ప్రాకృతిక రక్షణ వలయముగా అమరినది. అయితే కొన్ని ఆర్ధిక, రాజకీయ కారణాల వలన శ్రీరామ సేతువునకు విఘాతము కలుగుచూ, వార్తలలో ప్రధానాంశముగా మారి అందరినీ కలవర పెడుతోంది.


Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb