Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Aavakaaya Special

ఎవరు సెలెబ్రిటీ?

By Kamala M, Feb 12 2010 5:48AM
రియాలిటీ షోలు అనబడే వింతైన సర్కసులు ప్రతి ఛానెల్లోనూ తు.చ. తప్పకుండా ప్రసారమౌతున్నాయి. వీటిల్లో పాల్గొన్నవాళ్ళకు, ప్రొడ్యూసర్లకు ఏమైనా ఉపయోగము ఉంటుంది ఏమో కానీ చూసినవాళ్ళకు స్వల్పమైనా ప్రయోజనము లేదు. మానసిక ఆహ్లాదము కూడా కలగదు.

కొన్ని రోజుల కిందట "వావ్ - మంచి కిక్కునిచ్చే గేమ్"ను చూడడం జరిగింది. అందులో పాల్గొన్న కొద్దిమంది "సెలెబ్రిటీ"ల తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయాను. సెలెబ్రిటీల తెలివి(తక్కువ)తేటల్లోని కొన్ని ఆణి ముత్యాలు:

సాయికుమార్: పోతన తల్లిదండ్రులు ఎవరు?
సెలెబ్రిటీ:(పెదవి విరిచి) మా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు పోతన పేరుతో. వాడి తల్లిదండ్రుల పేర్లు చెప్పొచ్చా!

సాయికుమార్: బర్మా దేశాన్ని ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు?
సెలెబ్రిటీ: రంగూన్ (చాలా కాన్ఫిడెంట్ లుక్ తో చెప్పారు)

పై ఆన్సర్లు ఇచ్చిన సెలెబ్రిటీ గొప్ప సినిమా కథా రచయిత(!).

మరో సెలెబ్రిటీని చూద్దాము.

సాయికుమార్: ఇంద్రుడి ఆయుధం ఏది?
సెలెబ్రిటీ: పాస్ (కనీసం రెండు సెకన్లు కూడా ఆలోచించలేదు)

సాయికుమార్: "పా" చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్ర పేరేమి?

సెలెబ్రిటీ:అయ్యో! వో! ఛస్! (తలపై చేతులు వేసుకోవడము క్లైమాక్సు)



******


ఒకప్పుడు సిద్ధార్థ బసు నిర్వహించిన Quiz Time, ఆ తర్వాత డెరెక్ ఓ బ్రియాన్ నిర్వహించిన స్కూల్ పిల్లల క్విజ్ కార్యక్రమం ఎంత బాగుండేవో చూసినవాళ్ళందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అలాగే BBC వాళ్ళు ప్రపంచ స్థాయి క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ ఛానెలో గుర్తులేదు, వారు యూనివర్సిటీ స్థాయి ఛాంపియన్ షిప్ నిర్వహించారు.

వీటన్నిటినీ serious stuff అని పరిగణించి వావ్ ను light stuff అని తీసుకోవచ్చు. కానీ నా బాధంతా సో కాల్డ్ "సెలెబ్రిటీ"ల గురించే. ఒక్కరికి కూడా జనరల్ నాలెడ్జ్ సున్నా కావడం గురించే. వీళ్ళని సెలెబ్రిటీలుగా భావించి వాళ్ళనే ఇమిటేట్ చేసే వాళ్ళ తెలివి ఇంకెంత తెల్లవారిపోతుందో అని నా బాధ.
Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb
12