Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Chitravalokanam

పవలక్కోడి

By kadambari piduri, Feb 12 2010 8:55AM


అత్యంతాద్భుత చిత్రం "మాయాబజార్" గ్రాఫిక్ ఇంద్రజాల మహేంద్ర జాలాలతో ఇప్పుడు తెలుగు నాట విజయభేరీని మార్మోగిస్తూ న భూతో-న భవిష్యతి అని నిరూపిస్తూన్నది ఈ చిత్రరాజం.

       

ఐతే ఇందులో వింత ఏమిటంటే, ఈ కథ అసలు మహాభారతములో (జన రంజకమైన ఈ మహా ఇతిహాసము యొక్క అసలు పేరు "జయం") లేనే లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విశేషం కూడా ఉన్నది; అదేమిటంటే, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, ఎస్.వి.రంగారావు మున్నగు హేమాహేమీలు నటించిన ఈ సినిమాలో, పంచ పాండవులు కానరారు; వారు అజ్ఞాత వాసంలో ఉన్నారు కదా , అలాగే ఈ సినిమాలో కూడా వారి పాత్రలను అజ్ఞాతములో ఉంచినట్టి దర్శకత్వ ప్రతిభ, తర్వాతి తరాల సినీ రంగానికి మార్గ దర్శకత్వం వహించింది అనడంలో ఎలాటి సంశయమూ అక్కర లేదు.

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb
12