|
|
|
నౌఖాలీ చేదు నిజం
సుచేతా కృపలానీ నౌఖాలీలో "గాంధీ శాంతి సంఘము” యొక్క కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే వారు. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు దుష్కరమైన సంగతి తెలిసింది. Gandhi's Peace Mission లో సభ్యులైన ముగ్గురు బాలికలను ముస్లిములు కిడ్నాప్ చేయబోతున్నారని.
ఇది తెలియగానే సుచేతా కృపలానీ చాలా గాభరా పడ్డారు. ఏమి చేయాలో దిక్కు తోచలేదు. ఫొరుగు ఇంట్లో భూస్వామి అయిన ఒక ముస్లిము వృద్ధుడు నివసిస్తున్నాడు. ఆమె మువ్వురు అమ్మాయిలతో పొరుగు ఇంటికి వెళ్ళినది;
“దయ చేసి వీరిని కాపాడండి!” ఆని అడిగింది.
అతడు ఖురాన్ పై చెయ్యిని పెట్టి ప్రమాణం చేస్తూ అన్నాడు; “దీదీజీ!మీకు పూర్తి భరోసాను ఇస్తున్నాను. ఈ పిల్లలను మీరు కోరినంత కాలం , నా కూతుళ్ళతో సమానంగా చూసుకుంటాను. వీరి సంపూర్ణ రక్షణ బాధ్యత నాదే! మీరు నిశ్చింతగా ఉండండి.”
ఆయన గృహంలో వారు ముగ్గురూ, మూడు నెలల పాటు ఉన్నారు. ఆ విధంగా ఆ ముస్లిము వారిని కన్న కుమార్తెల వలె రక్షించాడు. కానీ తర్వాత చేదు సంఘటనలు గాంధీజీ నిర్లిప్తంగా, అయ్యేటట్లు చేసాయి. ఆ బాలికలను వారి కుటుంబీకులు నిరాకరించారు.
నౌఖాలీ లో శాంతి నెలకొన్న పిమ్మట జరిగిన ఈ సంఘటన గాంధీజీని కలచి వేసినది. సాంప్రదాయక హిందూ కుటుంబీకులు ముస్లిము ఇంట మూడు నెలలు ఉన్నారు - అనే కారణము వలన వారిని స్వీకరించడానికి ఒప్పుకోలేదు. నిలువ నీడ లేకుండా పోయిన వారికి “గాంధీజీ ఆశ్రమము”లో ఆశ్రయము లభించినది. వారు తమ జీవితాలను సంఘ సేవకు అంకితం చేసారు.
|
| | |
|
|