ఈ అన్నమాచార్యుల కీర్తనలో "తోమని పళ్ళాల వాడు" (తోమని పళ్యాల వాడే)అని సంబోధనను పరిశీలన చేస్తారా? అచ్చ తెనుగు మాటలతో తిరుమల గిరి శ్రీనివాసునికి కొంగ్రొత్త పేర్లను పెట్టి, వివిధ నామ ధేయాలతో స్వామిని నోరారా పిలిచే చనువును సంపాదించుకున్నట్టి భక్తాగ్రేసర కవి మన అన్నమయ్య అని ఘంటాపథంగా చెప్పుకో వచ్చును.
ఫ్రాచీన కాలంలో 'మట్టి పాత్రలను'వంట చేయడానికి ప్రజలు వాడే వారు. కురవత్తి నంబి శ్రీ తిరుమలేశుని అనురాగముతో సేవలు చేసే వాడు. వాత్సల్య భక్తితో సేవించే కురవతి నింబి వృత్తి రీత్యా "కుమ్మరి వాడు". కుంభకారుడైవ నంబి ఆహార, భక్ష్యాదులను కుండలలో వండి ఆ పదార్ధాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించు కునే వాడు. ఇదే ఆనవాయితీ ఆ తర్వాత చాలా సంవత్సరముల పాటు కొన సాగింది. దేవళములోని సిబ్బంది “ మట్టి పాత్రలలో వంట చేసి తయారు చేసిన భోజన , ప్రసాదాదులను భక్తులకు ఇచ్చేవారు.