"నేరాన్ని ఒప్పుకొంటున్నావా?" అని జడ్జ్ అడిగితే "నువ్వొప్పేమంటే, నేనొప్పేస్తానా!" అని నడుము కులికించాడట ప్రపంచ కుఖ్యాత డైరీయిస్టు డేవిడ్ డెడ్లీ (డైరీ) ఛేజ్.
భారత పట్టణాల మ్యాపులుండే అనేకరకాల డైరీల్ని కొని ఇంట్లో పెట్టుకొవడమే కాక ఆ మ్యాపుల్లో కొన్ని ప్రాంతాల్ని ఎర్ర ఇంకుతో రౌండ్ మార్కులు చేసినందుకు అనుమానమొచ్చిన డేవిడ్ ఇంటి పనిమనిషి మిన్నసోటా పోలీసుల చెవిలో గొసగొసలోడగా (ఆ పనిమనిషి పొదహోరొణాల బొంగ్లా బేబీ), క్షణమాలస్యం చేయకుండా అరెస్టు చేసారు.
"ఏల కొంటివి (డైరీలను), ఏల గీచితివి (ఎర్ర మార్కులను), ఏమిటోయీ నీ ఉద్దేశము?" అని అడగ్గా "అది ఒక రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ, మేడ మీద మారుమూల గది, ఆ గది తల్పులు తీసి మెల్లగా..." అని చెబుతూ డ్రమెటిక్ ఎఫెక్ట్ కోసం ఆపగా, వోడాఫోను జూజూల్లా ముఖాలు పెట్టి జ్యూరీ సభ్యులు "హూల? హూల హోల?" అని అడిగారట. ఐతే ఎంతకూ డైరీ డేవిడ్ నోరువిప్పక "జుజుజుజూ....జుజుజుజూ" అని మాత్రమే గొణిగాడట. దాంతో కోపమొచ్చిన జ్యూరీ సభ్యులు తాము వోడాఫోన్ జూజూలు కామని నొక్కి చెప్పడానికి డైరీ డేవిడ్ ను ద్రోహిగా తీర్మానించి భారత దేశానికి అప్పగించాలని నిర్ణయించారు.
త్వరలో సిస్టర్ మొమొతొ బొనెర్జీ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని అమెరికాకు పంపిస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎస్.ఎం.కృష్ణనో, చిదంబరమో కాక మొమొతో బోనెర్జీ ఎందుకని పిచ్చి ప్రశ్న వేసిన ఓ విలేకరిని సదరు రైల్వే మంత్రి చెంప మీద కొట్టారన్నది తాజా వార్త.
(అమోర్ బొంగ్లా బేబీ వల్ల కుఖ్యాత డైరీ టెరరిస్ట్ పట్టుబడ్డాడన్న కామన్ సెన్స్ లేనివాడు విలేకరి ఏట్లైనాడన్నది మేడం మొమొతొ గారి బాధని ప్రొణొబ్ ముఖొర్జీ ఉవాచ)