|
|
|
రూట్స్
ఏడు తరాల కథ – అది. అ నవల పెను సంచలనమే కలిగించింది. అలెక్స్ హేలీ రచించిన అ విపుల రచనయే "ది రూట్స్".
1750 సంవత్సరాల నుండి మొదలైన కథ ఇది. హటాత్తుగా విశలమైన నేల, సాక్షాత్తూ ఒక ఖండమే కనుగొనబడినది అక్కడికి పొలో మంటూ యూరోపియన్ జాతులు కోట్లాది మంది వలస వెళ్ళారు. మానవేతిహాసంలోనే కనీ వినీ ఎరుగనట్టి ,”మహా వలసల చారిత్రాత్మక సంఘటన" అది.
అలా వెళ్ళి సెటిల్ అవుతూన్న వారికి, వందలాది ఎకరాలు సాగు చేసే అక్కర కలిగినది. అందుకై మనుష్యులను కిడ్నాప్ చేయడానికి ప్రారంభించారు. సదరు అమెరికా కాంటినెంటుకు దగ్గర ఆఫ్రికా ఖండము. ఆఫ్రికా వాసులు చదువు సంధ్యలు లేని వారు, నాగరికత వాసన అంతగా సోకని అమాయక మైన మరో ప్రపంచం. తత్ఫలితమే అక్కడి జనులను సులభంగా కిడ్ నాప్ చేసి, తమ దేశలకు తరలించి, బానిసలుగా మలుచుకో గలిగారు.
అతి కర్కశ చారిత్రక పరిణామంలో దయనీయంగా నలిగి పోయిన ఆఫ్రికా జాతీయుల వాస్తవ గాథ ఈ "రూట్స్" అనే గ్రంధము. ఏడవ తరానికి చెందిన హేలీ కఠోరమైన శ్రమ దమాద్ద్ద్దులకోర్చి, తన మూల కందములను కనుక్కోగలిగాడు. అతని ఆత్మ కథను అక్షర రూపంలో ప్రపంచ సాహిత్యానికి అందించాడు.
|
| | |
|
|