Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Telusaa!

ఆఫ్రికాలో హేమవిద్య

By kadambari piduri, Apr 6 2010 10:35AM
ఏడు తరాల కథ – అది. అ నవల పెనుసంచలనమే కలిగించింది. Alex Haley రచించిన అ విపుల రచనయే “The Roots“.
1750 సంవత్సరాల నుండి మొదలైన కథ ఇది. సడన్ గా విశాలమైన నేల, సాక్షాత్తూ ఒక ఖండమే కనుగొనబడినది;
అక్కడికి పొలోమంటూ యూరోపియన్ జాతులు కోట్లాదిమంది వలస వెళ్ళారు.
మానవేతిహాసంలోనే కనీవినీ ఎరుగనట్టి, ”మహా వలసల చారిత్రాత్మక సంఘటన" అది.
అలా వెళ్ళి సెట్టిల్ అవుతున్నవారికి, వందలాది ఎకరాలు సాగు చేసే అవసరం కలిగినది. అందుకై మనుష్యులను కిడ్నాప్ చేయడానికి ప్రారంభించారు.
సదరు అమెరికా కాంటినెంటుకు దగ్గర ఆఫ్రికా ఖండము.
ఆఫ్రికా వాసులు చదువు సంధ్యలు లేనివారు, నాగరికత వాసన అంతగా సోకని అమాయక మైన మరో ప్రపంచం. తత్ఫలితమే అక్కడి జనులను సులభంగా కిడ్నాప్ చేసి, తమ దేశలకు తరలించి, బానిసలుగా మలుచుకో గలిగారు.
అతి కర్కశ చారిత్రక పరిణామంలో దయనీయంగా నలిగిపోయిన ఆఫ్రికా జాతీయుల వాస్తవ గాథ ఈ “ రూట్స్ “ అనే గ్రంధము.
ఏడవ తరానికి చెందిన హేలీ కఠోరమైన శ్రమకోర్చి, తన మూలాలను కనుక్కోగలిగాడు. అతని ఆత్మకథను అక్షరరూపంలో ప్రపంచ సాహిత్యానికి అందించాడు.

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb
12