|
|
|
రఘు వీర గద్యము
"రఘువీర గద్యము" అనగా వచన రూపములో రాసిన భక్తి మాలిక. తిరువన్ఇంద్రపురములో ఉన్నప్పుడు శ్రీ వేదాంతదేశికన్ కోవెలలోని కోదండ రాముల వారిని దర్శించి, భక్తి పరవశత్వముతో ఈ "గద్య"ను రాసారు.
శ్రీలంకలో రావణునితో పోరాడినప్పుడు మహాయోధగా విరాజిల్లిన శ్రీ రాముని రూపలావణ్య సంపదలకు దేశికుని మానసము అంకితము ఐనది. "కోదండము" అనే నామము కల ధనుస్సును ధరించినాడు సీతాపతి. ఆ కోదండ రాముని వర్ణిస్తూ సాగిన వాక్య పరంపరయే "శ్రీ రఘు వీర గద్యము".
స్వామి శ్రీ నిగమాంత మహా దేశికన్ రచించిన ఈ గద్యము, భక్తి సాహిత్యములో గుర్తించబడినది. కీర్తనలు, భజనలు చేస్తూ సంగీత మార్గాన్ని ఏర్పరచిన త్యాగరాజు, భక్త రామదాసు మున్నగు వారి అనుయాయులు శ్రీ రామ భక్తులు, శ్రీ దేశికన్ విరచితమైన "రఘు వీర గద్యము"ను గానము చేస్తూంటారు; వారు Azhwaars, Kambar అని పిలువ బడుతున్నారు. రామాయ , రామ భద్రాయ రామ చంద్రాయ,వేదసేః రఘు నాథాయ, నాథాయ సీతయా పతయేః నమః
|
| | |
|
|