|
|
|
నావి కాలేని నీవి - నానీలు మరో సమాలోచనం
గతంలో "నానీ"ల ప్రయోగంపై నేను వ్రాసిన వ్యాసం, ఆవకాయ పాఠకులకు ఇక్కడ :
ఎన్ని గజాలు వ్రాసావన్నది కాదు ముఖ్యం ఎన్ని నిజాలు చెప్పావన్నది ముఖ్యం నిన్నటి మహాకావ్యం పద్దెనిమిది పర్వాలైతే నేటి మహాకావ్యం పద్దెనిమిది పేజీలు.
ఏ సందర్భంలో ఆరుద్రగారు వ్రాసారో కానీ, నానీల పేరుతో ఈమధ్యకాలంలో విశృంఖలంగా వస్తున్న కవితలనబడే సాహిత్యాన్ని చూసినప్పుడల్లా గుర్తొచ్చే పంక్తులవి.
పద్దెనిమిది పేజీలేమో కానీ, పది లైనులు కూడా వ్రాయలేని ప్రబుద్ధులందరూ ఒక ఇమేజరీతో ఒక ప్రకటనతో నాలుగులైనులు గిలికేసి, దాన్నే కవిత్వంగా సరిపుచ్చే ధోరణి ప్రబలిపోతున్నది.
అసలు హైకులు, మినీకవితలు వంటి ప్రక్రియలు ప్రత్యేకించి ఉండగా ఈ నానీలని తవ్వి తలకెత్తుకోవలసిన విశేషం ఏమైఉంటుందనేది ఈ విమర్శనాత్మక వ్యాసపు ప్రధానోద్దేశ్యం.
ఈ వ్యాసానికి ఉపకరించిన పుస్తకం నానీల ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నానీల నాన్నగారి (ఈ వ్యాసంలో 'నా.నా. గారూ - ఎన్. గోపి గారు) తొలివారసుడుగా (ఈ వ్యాసంలో నా.వా.గారు) ఎస్. ఆర్.భల్లం గారు సంపుటీకరించిన వ్యాసాల, సమీక్షల, జనవాక్యాల సమ్మేళనం 'నానీల సమాలోచనం' అనే పుస్తకం.
"హైకూలు రాసే కవులు కూడా ఈ నానీని పోటీ కవితా ప్రక్రియగా భావించక, సహృదయతతో అక్కున చేర్చుకొన్నారు" అంటూ నా.వా.గారు వ్రాసిన సంపాదక వాక్యంలోనే నానీ ప్రక్రియకు దోహదంచేసిన కారణాలు అన్యాపదేశంగా ప్రకటీకృతమౌతున్నాయి.
|
| | |
|
|