|
|
|
నీలముపై పగడం
మౌళి పింఛము వాని పెదవుల భావగర్భిత మంద హాసము ఇంద్రనీలము మేని ఛాయల ఒదిగినట్టి పగడ మెవరే??? ఆ మణి ప్రవాళ మెవరే?? ||
(చెలులు)::: “ ఇంకెవ్వరమ్మా! రాధిక ! మన రాధిక! "
1. ప్రణయ దృక్కులు జతలు జతలుగ అల్లుకున్న తోరణమ్ములు కెంపు, నీలము కన్నయ్య, రాధిక ఇంపు పెంపుల రాగ మాలిక ||
2. కళా సీమలకీ జోడీ సరిగ పోగుల చాందినీ సకల హర్షామోద ద్యుతి తతి స్వర్ణ కానుకలీ పుడమి తల్లికి || |
| | |
|
|