Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Chitra Varta

ఆత్మబలం

By kadambari piduri, May 30 2010 6:40AM


"ఆత్మబలం” తెలుగు సినిమా నిర్మాణం జరుగుతున్న రోజులలోని కొన్ని సరదా జ్ఞాపకాలను కథానాయకి బి.సరోజాదేవి కబుర్లలో చెప్పారు. తను జోడీగా నటించిన హీరోలలో, అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిత్వం గురించి తన అభిప్రాయాలను వెల్లడించినది.

"నాగేశ్వర రావుకు అసలు కోపమే ఎరుగని తవం. ఎప్పుడూ నవ్వుతూ, జోవియల్గా ఉంటారు. జోక్సు వేస్తూంటారు, నవ్విస్తూంటారు . ఏ విషయం తీసుకున్నా, అనర్గళంగా ఆ అంశం పై మాట్లాడుతూండడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. షూటింగు సమయంలో కూడా ఇతరుల లాగా చిరాకు పడరు ,కోప తాపాలకు ఈయన అతీతులేమో!" అని నాకు అనిపిస్తూంటుంది.

"ఆత్మబలం" షూటింగు జరుగుతూన్నప్పుడు, మా బంధువులు, సన్నిహితులూ నన్ను చూడడానికి వచ్చారు. నేను వాళ్ళను కలవడానికి లేస్తూన్నాను. అలా నిలబడుతూండగా, A.N.R. నా జడ పట్టుకున్నారు. నన్ను లేవనీయకుండ "నీ జడ నా చేతిలో ఉంది. ఎలా వెళ్తావు? వెళ్ళాలన్నా వెళ్ళలేవు." అన్నారు నాటకీయ ఫక్కీలో.



Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb
12