|
|
|
చదరంగ క్రీడకు అధిదేవత
1763 లో, 17 సంవత్సరాల వయసులో విలియం జోన్స్ లాటిన్ భాషలో ఒక పద్యాన్ని వ్రాసాడు. 658 లైన్లు ఉన్న ఆ పోయెం పేరు "Scacchia, Ludus" ; Marco Girolamo Vida 1527 ల్) ఆ పద్యాన్ని పబ్లిష్ చేయించారు.
భారత దేశంలో ఉదయించిన గృహ క్రీడయే "చతురంగము". ప్రపంచ క్రీడా పటములో సుస్థిర స్థాన్నాన్ని ఆర్జించినది మేధా శక్తికి పదును పెట్టే ఈ "చదరంగము". ఈ చెస్ ఆటకు గల పౌరాణిక గాథా రూపాన్ని జోన్స్ తన Latin poem" ద్వారా వెలుగులోనికి తీసుకు వచ్చాడు .
మొదట లాటిన్ భాషలో రాసిన, తన పద్యానికి అతడే ఇంగ్లీష్ లో కూడా రచించాడు. ఇందులో - ఇమిడ్చిన కథ ఇది; మార్స్ యుద్ధ దేవుడు. కైసా యక్ష కన్యక. మార్స్ ఆమె ప్రేమిస్తాడు. అందుకు అతని స్నేహితుడు " CHESS game " ను సృష్టించి, బహుమతిగా ఇచ్చాడు.
"గులేబకావళి" అనే తెలుగు సినిమాలో ఎన్.టి.రామారావు కథానాయిక 'జమున'ను చదరంగంలో గెలుస్తాడు. అదే పద్ధతిలో, మార్సు కూడా కైసాను చెస్స్ గేము లో ఆమెను గెలిచాడు. ఆనాటినుండీ, Caissa "goddess" of chess"గా (చదరంగ క్రీడకు అధిదేవతగా) పేరుగాంచినది.
|
| | |
|
|