Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Selayeru

విరహగీతం

By swatee sripada, Jun 24 2010 9:36AM

పులకింతల పున్నాగలు ఏ వాకిట కురిసినా
తొలకరించు తొలి పలుకులు ఏ నోటన పలికినా
పరిమళాల ప్రవాహాలు పరుగులిడే గుబాళింపు
కనుసన్నల జాజిపూలు పల్లవించు కావ్యాలే

ఆవంకన జాలువారు జలపాతపు తలపులెన్నో
ఈ వంకన నింగి తాకు సింగిణీల విల్లంబులు
కనుపాపల కదలికలో హొయలొలికే సోయగాలు
కనగలిగే మనసుకైతే అరచేతిన స్వప్నమౌను

నిర్నిద్రలొ ఊహకొలను తొలిచూపుల స్పర్శకేను
జలజలమను పల్లవాల పారిజాత గమకాలై
చిరు సవ్వడి అలికిడిలో ఆదమరచి ఒక్కక్షణం
తెల్లవారె కలలన్నీ తెల్లబోయె మల్లె

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb