|
|
|
పల్నాటి వీరభారతం-ముందుమాటలు
ప్రచురణ కర్తల మాటల్లో రచయిత పరిచయం:
రచన ఒక వరంగా, వాక్య నిర్మాణం ఒక అద్బుత శిల్పంగా భావించే అరుదైన రచయితల్లో చిట్టిబాబు ఒకరు. పేరులోనే పెన్నిధి వున్న కథకుల్లో వీరిని చేర్చాలి. మాటల్ని ఎక్కడ పొందికగా, మధురనిష్యందంగా ఉపయోగించాలో , ఎక్కడ పాఠకుల్ని తమ "గ్రిప్ "లోకి తెచ్చుకోవాలో తెలిసిన రచయితల్లో ఒకర్నిగా ఈయనను చెప్పాలి.
దాగిన కన్నీరు, కథ కంచికి, వెలిగే దీపం, వీనస్ , కాలవాహిని, పూచినపున్నాగ, చిత్రమైన జీవితం, పాతకొమ్మ-కొత్తరెమ్మ, మరోమలుపు, మురళీరవళి, అచ్చుతప్పులు, అసమగ్ర చిత్రాలు, ఎక్కలేని రైలు, మనిషి జీవితంలోని మరపురని అనుభవాలు, జీవన సంధ్య మొదలైనవి వీరి ప్రచురితమైన నవలలు.
వీరి నాటకం "ఒరేయ్ " తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నది.
మధ్యరకం సంసారాల కథల్లో నిజాల్నీ వారి మధ్య చిత్రమైన అనురాగాల్నీ, రంగులపటంలా కళ్ళ ముందు వేలాడేసే కథావిధానం, పరుగెత్తే సెలయేరులాంటి రచనతో పాటు మమకారపు దు:ఖాంతాల కథల్లో వీరు స్థితప్రజ్ఞులు.
పల్నాటి వీరభారతం పల్నాటి వీరుల పౌరుష గాధ. సమగ్రమైన తొలి పల్నాటి తెలుగు నవల.
----బుక్ ట్రస్ట్ బ్యూరో, గాంధీనగరం, విజయవాడ - ప్రచురణకర్తలు
|
| | |
|
|