|
|
|
సుఖం - సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? మొదటి భాగం
గ్రంథకర్త పరిచయం:
"సుఖం - సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా?" అన్న ఈ చిన్ని గ్రంథాన్ని నాకు గురువులైన శ్రీ పుష్కరప్రసాద్ ఆచార్యుల విద్యా గురువులైన శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు రచించారు.
శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు వేద, పురాణ, తర్క, మీమాంస శాస్త్రాల్లో నిష్ణాతులు. మూడుపదుల వయస్సులో సన్యాస దీక్ష స్వీకరించి మైసూరు పట్టణంలో నివసించారు. దాదాపు నాలుగు దశాబ్దాలు సన్యాసాశ్రమంలో గడిపి 1994వ సంవత్సరంలో హరిపాదాలను చేరారు. వారి బృందావనం కర్నాటక-ఆంధ్ర సరిహద్దులో ఉన్న "ముళబాగలు" లో కృష్ణదేవరాయల రాజగురువైన శ్రీ వ్యాసరాజ తీర్థుల గురువులైన శ్రీ శ్రీపాదరాజ తీర్థుల సాన్నిధ్యంలో ఉంది.
కన్నడంలో వారు వ్రాసిన ఈ చిరు పొత్తాన్ని తెలుగులో అనువదించాలని ప్రయత్నించాను. ఇందులో లోప, దోషాలన్నీ నావేనని, మంచి విషయాలన్నీ పరమ గురువులకే చెందుతాయని వినతి చేసుకుంటున్నాను.
శుభాన్ ధ్యాయంతి యే కామః | గురుదేవ ప్రసాదజాన్ తద్దితరాన్ ఆత్మ పాపోత్థాన్ | తేషాం విద్యాం ఫలిష్యతి
|
| | |
|
|