|
|
|
చతురతల దొర
వల్ల మాలిన కోపమేలయ్యా! చల్లనయ్యా! తాల్మి దాల్చుమయా! నీ బుల్లి పెదవుల నవ్వు చిందించు! ||
చల్ల కుండల పగుల కొట్టి గొల్ల భామల నల్లరెడతావు; ఒల్ల కుండగ లేవిదేమయ్యా! పొల్లు పోనీ చిలిపి తనములు నీదు సొమ్ములిదేమి వింతయ్యా! ||
హరి చందనములను చల్ల మన్నావా “మన్నారు దేవా”! విరుల దండల పరిమళాల సిరి - వాలు చూపుల తేరు నెక్కేవా! దొరవు చతురతల కెల్లెడల నీవే! || |
| | |
|
|