|
|
|
నెలవంకపై చందమామ
"ఒకే సారి ఒకే చోట నెల వంక, జోడీగా పున్నమీ జాబిల్లి వెలిసె నెటుల? చెప్పవమ్మ! ఈ చిక్కు ముడిని విప్పవమ్మ! ముద్దుగాను అమ్మాయీ!" ||
"జనని గోరు నెల వంక! ఆ కొన గోటిపైన గోరు ముద్ద – అరయగాను అదే నిండు చంద మామ! ఇదే కదా జవాబు!" ||
“అరెరె! చిటికెలొ చెప్పేసినావు; ఏమి కిటుకు దాచినావు? వివరించవోయి, అబ్బాయీ!”
"ఇంతప్పటి నుండీ కన్న తల్లి ఒడిలోన వెండి గిన్నె – పాల బువ్వ మారాము చేస్తు తిన్నాము! ఆ మాత్రం తెలుసుకోమ? చిట్కా వేరెందులకు?” |
| | |
|
|